Reading Time: < 1 minute

న్యూయార్క్: హెచ్1బి వీసాల జారీ ప్రక్రియలో అ మెరికా కీలక మార్పులు చేసింది. ఇందుకు సం బంధించిన నిబంధనలను అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఇవి అమలులోకి వస్తాయని ఆ ప్రకటనలో తెలిపినట్లు వివిధ వార్తా సంస్థలు ఓ కథనాన్ని అందించాయి. 2027 ఆర్థిక సంవత్సరం హెచ్-1బి క్యాప్ రిజిస్ట్రేషన్ సీజన్‌కు ఇవి వర్తిస్తాయి. ఈ కొత్త విధానంలో హెచ్ 1 బిలను ఇప్పుడున్నట్లుగా ర్యాండమ్‌గా జారీ చేయ రు. అత్యధిక వేతనాలు, అధిక నైపుణ్యాలు ఉన్న వ్యక్తులకు వీసా పొందే అవకాశాలు ఎక్కువగా ల భిస్తాయి. ఇక తక్కువ జీతం లేదా ఎంట్రీ లెవల్ ఉ ద్యోగులకు వీసా ఎంపిక ప్రక్రియలో తక్కువ ప్రా ధాన్యం ఉంటుంది. ఈ కొత్త పద్ధతి కోసం హెచ్ 1బి ఉద్యోగులకు ఇచ్చే వేతనాలను అమెరికా కా ర్మిక శాఖ క్రమబద్ధీకరించింది. నాలుగంచెల వేత న వ్యవస్థగా విభజించింది.

ఎంట్రీ లెవల్ వర్కర్లను లెవల్-1గా.. నైపుణ్యం కలిగిన ఉద్యోగలను లెవల్ 4గా పరిగణిస్తారు. ఇందులో ఎంట్రీ లెవల్ ఉద్యోగులకు ఇప్పటిలాగే ర్యాండమ్ విధానంలో లాటరీ తీయనున్నారు. మిగతా వారికి మాత్రం వారి వే తన స్థాయి ఆధారంగా  లాటరీలో ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. అత్యధిక వేతనం కలిగిన లెవల్ -4 ఉద్యోగలకు నాలుగుసార్లు లాటరీలో ప్రవేశించే వీలు ఉంటుంది. అదేవిధంగా లెవల్ -3 వారికి మూడుసార్లు, లెవల్ -2 వారికి రెండుసార్లు లాటరీలో పాల్గొనే అవకాశం దక్కుతుంది. ఇక ఎంట్రీ లెవల్ వారికి మాత్రం ఒక్కసారి మాత్రమే లాటరీలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. అంటే.. నైపుణ్యం కలిగిన వారికి వీసా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పద్ధతిలో ఎంట్రీ లెవల్ వారికి వీసా లభించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాగా.. అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు, జరిమానాలు తప్పవని భారత్‌లోని అమెరికా ఎంబసీ తీవ్రంగా హెచ్చరించింది. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.