Reading Time: < 1 minute
Kiara Advani Emotional Comments On Motherhood And Toxic Movie Updates

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ప్రస్తుతం సినిమాలతో పాటు తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో అద్భుతంగా గడుపుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో వివాహం, ఆపై తల్లిగా మారిన తర్వాత ఆమె ప్రపంచమే మారిపోయిందట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కియారా మాట్లాడుతూ.. ‘అమ్మనయ్యాక జీవితం పట్ల నా కోణం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు నేను ఒక ‘ఆడపులి’లా తయారయ్యాను. నా బిడ్డను కాపాడుకోవాలనే తపనతో నాలో తెలియని ధైర్యం, శక్తి పెరిగాయి’ అంటూ చాలా భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. ఈ మాటలు విన్న నెటిజన్లు, ముఖ్యంగా తల్లులు.. కియారాలోని మాతృత్వపు ఆరాటాన్ని చూసి ఫిదా అవుతున్నారు. అలాగే..

Also Read: Nithin: ఒకేసారి మూడు సినిమాలతో నితిన్ జోరు!

పెళ్లి తర్వాత కూడా తన భర్త సిద్ధార్థ్‌తో బంధం ఏమాత్రం మారలేదని, మునుపటిలాగే సరదాగా ట్రావెల్ చేస్తూ, సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నామని ఆమె తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. రామ్ చరణ్‌తో చేసిన ‘గేమ్ ఛేంజర్’ తర్వాత కియారా ఇప్పుడు కన్నడ స్టార్ యశ్ (Yash) నటిస్తున్న భారీ పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘టాక్సిక్’ (Toxic) పై పూర్తి ఫోకస్ పెట్టారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె ‘నాడియా’ అనే ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతోంది. నయనతార, హుమా ఖురేషి వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా అంతర్జాతీయ కారణాల వల్ల జూన్ 4, 2026కి వాయిదా పడింది.