
టెహ్రాన్: ఇరాన్‌లోని ఇస్ఫహాన్ నగరంపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఇస్ఫహాన్ నగరంలో అణుకేంద్రాలే లక్ష్యంగా యుఎస్‌ఎ దాడులు చేసింది. ఆయుధ నిల్వలు ఉన్న ఓ డిపోపై రెండు వేల పౌండ్ల బంకర్ల బస్టర్‌లతో దాడికి పాల్పడింది. అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. ఈ దాడికి సంబంధించిన వీడియోను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. ఇరాన్‌లో చమురు, ఇంధన, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తానని ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. హర్మూజ్ జలసంధిలో రాకపోకలను తిరిగి తెరవకపోతే తీవ్ర పరిణమాలు ఉంటాయని ఇరాన్‌ను అమెరికా హెచ్చరించిన విషయం విధితమే. ఖర్గ్ దీవిని స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ పలమార్లు హెచ్చరించారు. గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా స్థావరాలపై ఇరాన్ కూడా భీకర దాడులు చేస్తూనే ఉంది. గల్ఫ్ దేశాలలో గగనతల అభద్రత మరింత పెరిగింది. తమ దేశం గగనతలం నుంచి అమెరికా యుద్ధ విమానాలను అనుమతించమని స్పెయిన్ రక్షణ శాఖ మార్గరిటా రోబ్లెస్ ప్రకటించారు. ఇరాన్‌తో అమెరికా చేస్తున్న యుద్ధానికి స్పెయిన్ దేశం తొలి నుంచి వ్యతిరేకిస్తోంది.