Reading Time: 2 minutes
Csk Misses Ms Dhoni Chennai Suffers Heavy Defeat Vs Rr In Ipl 2026 Opener

CSK-MS Dhoni: ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా పేరుగాంచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు 2026 సీజన్ ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. అనుభవజ్ఞులైన సీనియర్లు, యువ ఆటగాళ్లతో ఎప్పుడూ సమతూకంగా ఉండే చెన్నైకి.. ఈసారి తమ ఆస్థాన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) గైర్హాజరీ పెద్ద లోటుగా మారింది. గాయం కారణంగా ధోని కోలుకుంటుండటంతో ఆయన లేని లోటు రాజస్థాన్ రాయల్స్ (RR) మ్యాచ్‌ లో స్పష్టంగా కనిపించింది. రాజస్థాన్ రాయల్స్‌ తో జరిగిన మొదటి మ్యాచ్‌లో చెన్నై జట్టు 8 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడింది.

Ravindra Jadeja: పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది.. దూబేను అలా బుట్టలో వేశా!

తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై బ్యాటర్లు రాజస్థాన్ బౌలర్ల ధాటికి క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. నిర్ణీత ఓవర్లలో కేవలం 19.4 ఓవర్లలో 127 పరుగులు మాత్రమే చేసి చేతులెత్తేశారు. జట్టులో రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ.. రాజస్థాన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. చెన్నై తక్కువ స్కోరుకే పరిమితం కావడంతో ప్రత్యర్థికి విజయం నల్లేరుపై నడకలా మారింది.

128 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఏమాత్రం తడబడకుండా కేవలం 13 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ముఖ్యంగా యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఫామ్‌ తో చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ పరాజయం చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ ఓటములలో ఒకటిగా నిలిచింది. మిగిలిన బంతుల పరంగా చూస్తే.. గతేడాది కేకేఆర్ (KKR) చేతిలో ఎదురైన ఓటమి తర్వాత ఇది రెండో అతిపెద్ద ఓటమి కావడం గమనార్హం.

MS Dhoni Invests: ఆ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిన “మిస్టర్ కూల్”.. బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా..!

ఏళ్ల తరబడి జట్టును ముందుండి నడిపి, కష్ట పరిస్థితుల్లోనూ విజయాన్ని సాధించిపెట్టే ధోని లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే టోర్నీ ఇప్పుడే మొదలైందని.. ఒక మ్యాచ్‌ తోనే జట్టు భవిష్యత్తును అంచనా వేయలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎస్కే ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన జట్టు త్వరలోనే పుంజుకోవాలని, ధోని త్వరగా మైదానంలోకి అడుగుపెట్టాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏదిఏమైనా జట్టులో ధోని లేని లోటు స్పష్టంగా కనపడుతుంది.