Reading Time: < 1 minute

జీవో 317 టీచర్లు, ఉద్యోగులకు వన్టైమ్ రిలీఫ్ ఇవ్వండి : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

Caption of Image.
  •     సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కవిత బహిరంగ లేఖ

హైదరాబాద్, వెలుగు: జీవో 317 బాధిత ఉద్యోగులు, టీచర్లకు ప్రభుత్వం న్యాయం చేయాలని, వన్ టైమ్ రిలీఫ్​ కింద వారిని స్వస్థలాలకు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్ ​చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కోరారు. బీఆర్ఎస్ ​హయాంలో 2021, డిసెంబర్​6న ఇచ్చిన జీవో 317లో స్థానికతపై స్పష్టత  లేకపోవడంతో టీచర్లు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ మేరకు సోమవారం సీఎం రేవంత్​రెడ్డికి ఆమె బహిరంగ లేఖ రాశారు. జీవో 317తో ఉద్యోగులు, టీచర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అప్పటి సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్​ లేఖ రాశారని గుర్తు చేశారు. 

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గెలిపిస్తే జీవో 317ను సమీక్షించి ఉద్యోగులు, టీచర్లకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటిదాకా నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు. జీవో 317 బాధితుల సమస్యకు పరిష్కారం చూపిస్తామంటూ మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారని, కానీ, ఇప్పటి వరకు ఆ నివేదిక ప్రభుత్వం బయట పెట్టలేదని విమర్శించారు. 

©️ VIL Media Pvt Ltd.