Reading Time: < 1 minute
Producer Skn Clarifies Ram Charans Peddi Release Date

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా విడుదల తేదీ గురించి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. ఏప్రిల్ 30న ఈ సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు న్యూస్ హల్ చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై నిర్మాత ఎస్‌కేఎన్ స్పందిస్తూ అసలు విషయాన్ని స్పష్టం చేశారు.

Also Read : Ustad Bhagath Singh : భారీ నష్టాలు మిగిల్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఎస్‌కేఎన్  నిర్మాతగా వస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ సినిమా  పెద్ది సినిమా జూన్ 25న రిలీజ్ అవుతుంది. అందుకే మా ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాని రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తున్నాం’ అని అన్నారు. దాంతో నెటిజన్లు ‘పెద్ది’ సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్ గా భావించారు. దీనివల్ల జూన్ 26న సినిమా వస్తుందని సోషల్ మీడియా పోస్టులు విపరీతంగా దర్శనమిచ్చాయి. దీంతో మెగా అభిమానుల్లో ఒక్కసారిగా గందరగోళం మొదలైంది. ఈ కన్ఫ్యూజన్ పై ఎస్‌కేఎన్ వీడియో రిలీజ్ చేస్తూ.. సోషల్ మీడియా లో కొన్ని ట్వీట్స్ చూసి పెద్ది పోస్ట్ పోన్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు అనుకున్నాను . ‘చెన్నై లవ్ స్టోరీ’ ఈవెంట్ లో పెద్ది సినిమా రిలీజ్ డేట్ గురించి నేను మిస్ కమ్యూనికేషన్ తో జూన్ 26 అని చెప్పాను. ఒక పెద్ద సినిమా రిలీజ్ విషయం లో క్లారిటీ లేకుండా మాట్లాడి నందుకు క్షమించండి. తాను చెప్పిన మాటలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందని ప్రస్తుతానికి ‘పెద్ది’ చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అధికారిక తేదీ వెలువడలేదని కేవలం ఒక ఉదాహరణగా లేదా వేరే సందర్భంలో అన్న మాటలను సినిమా విడుదలతో ముడిపెట్టవద్దని ఆ తేదీ కేవలం ఊహాగానమే తప్ప వాస్తవం కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు.