Reading Time: < 1 minute

పెట్రోల్‌‌‌‌‌‌‌‌ బంకుల ద్వారా కిరోసిన్‌‌‌‌‌‌‌‌ సప్లై.. దేశవ్యాప్తంగా సరఫరాకు కేంద్రం నిర్ణయం

Caption of Image.

న్యూఢిల్లీ: ఇరాన్‌‌‌‌‌‌‌‌ యుద్ధం కారణంగా గ్యాస్‌‌‌‌‌‌‌‌ సరఫరాలో ఏర్పడిన కొరతతో కిరోసిన్‌‌‌‌‌‌‌‌ పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎమర్జెన్సీ విండో ద్వారా కిరోసిన్‌‌‌‌‌‌‌‌ సరఫరాకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా కిరోసిన్‌‌‌‌‌‌‌‌ను పెట్రోల్‌‌‌‌‌‌‌‌ బంకుల ద్వారా పంపిణీ చేయనున్నారు. 

ఇందుకోసం ప్రభుత్వం నిబంధనలను సడలించింది. గతంలో కిరోసిన్‌‌‌‌‌‌‌‌ రహితంగా ప్రకటించిన 21 రాష్ట్రాలు/యూటీలు సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కిరోసిన్‌‌‌‌‌‌‌‌ కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంది.

©️ VIL Media Pvt Ltd.