
హైదరాబాద్: ఐపిఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. సిఎస్‌కెపై ఆర్‌ఆర్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్య వంశీ 17 బంతుల్లో 52 పరుగులు చేసి సునామీ సృష్టించాడు. సిఎస్‌కె విధించిన 127 పరుగుల టార్గెట్‌ను ఆర్‌ఆర్ 12.1 ఓవర్లలోనే చేధించి రికార్డు నెలకొల్పింది. చెన్నైపై 47 బంతులు మిగిలి ఉండగానే రాజస్థాన్ విజయం సాధించి రికార్డు సృష్టించింది. ఇదే రెండో అతి పెద్ద విజయంగా నమోదైంది. గతంలో చెన్నైపై కోల్‌కతా నైట్ రైడర్స్ 59 బంతుల తేడాతో ఘన విజయం సాధించి రికార్డులో తొలి స్థానంలో ఉంది. చెన్నైపై ఎక్కువ విజయాలు సాధించిన మూడో జట్టుగా ఆర్‌ఆర్ రికార్డు నెలకొల్పింది. చెన్నైపై ముంబయి(21), పంజాబ్(16), రాజస్థాన్(16) విజయాలు సాధించాయి. 2020 నుంచి చెన్నైతో 11 మ్యాచ్‌లు జరగగా రాజస్థాన్ 9 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఆర్‌ఆర్ బౌలర్ నంద్రే బౌర్గర్ రెండు మెయిన్ వికెట్లు తీయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.