Reading Time: 2 minutes

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా కల ర్ ఫొటో, బేబి వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘చెన్నై లవ్ స్టోరీ‘ సినిమాకు బిజినెస్ పరంగా మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉం ది. మెలొడీ బ్రహ్మ మణిశర్మ ‘చెన్నై లవ్ స్టోరీ‘ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. సోమవారం ఈ సినిమా నుం చి గుర్తుందా సాంగ్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మా త సాయి రాజేశ్ మాట్లాడుతూ “బేబి మూవీ విజయం తర్వాత మేము డబ్బుల వెనక పరుగు పెట్టలేదు. ఒక మం చి కథతో మళ్లీ మూవీ చేయాలని అనుకున్నాం. నా మనసుకు నచ్చిన ఒక కథను రాసుకున్నాను. కానీ ఈ సినిమా ను నేను అనుకున్నదాని కంటే బాగా తెరకెక్కించాడు రవి నంబూరి. ఈ చిత్రంలో హీరోకు సమాన ప్రాధాన్యత ఉన్న పాత్ర హీరోయిన్‌ది.

గత ఏడాది తమిళ సినిమాకు ఫిలింఫేర్ తీసుకున్న శ్రీ గౌరి ప్రియ..ఈసారి తెలుగు సినిమాకు కూడా తీసుకుంటుంది. ఈ సినిమా కిరణ్‌కు ఒక మరచిపోలేని మూవీ అవుతుంది”అని అన్నారు. డైరెక్టర్ రవి నంబూ రి మాట్లాడుతూ “నేను ఇంత పెద్ద మూవీ చేస్తున్నానంటే అందుకు కారణం ఎస్ కేన్, సాయి రాజేశ్. నేను ఎమోషనల్ మూవీ చేయగలనా అనుకున్న నాతో ఇలాంటి మంచి మూవీ చేయిస్తూ నా ప్రతిభను వెలికితీస్తున్నారు. కిరణ్ అన్న అద్భుతంగా నటించారు. శ్రీ గౌరి ప్రియ ఈ మూవీ కోసం చాలా కష్టపడుతోంది. మణిశర్మతో కలిసి వర్క్ చే యడం హ్యాపీగా ఉంది”అని తెలిపారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ “చెన్నై లవ్ స్టోరీ మూవీని డాల్బీలో చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ మూవీలో హీరోయిన్ ఒక దేవతలా అనిపించాలి. అలాంటి నివి పాత్రలో శ్రీగౌరి చాలా బాగా నటించింది. మణిశర్మ కంపోజ్ చేసిన ఏడు పాటల్ని థియేటర్స్‌లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇండియ న్ సినిమా గొప్ప లవ్ స్టోరీస్‌లో ‘చెన్నై లవ్ స్టోరీ‘ ఒకటి కా బోతోంది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మ్యూజి క్ డైరెక్టర్ మణిశర్మ, హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ, నిర్మాత ఎస్ కేఎన్, ధీరజ్ మొగిలినేని, విజయ్ పొలాకీ, విశ్వాస్ డేనియల్ అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.