Reading Time: < 1 minute

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పరిధిలో  రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బీభత్సం సృష్టించింది. తెల్లవారు జామున రగ్గుల షాపులోకి కారు దూసుకెళ్లింది. దుర్గానగర్ చౌరస్తా వద్ద వాహనం అదుపు తప్పింది. యూపికి చెందిన తండ్రీ కొడుకులు ఇద్దరు మృతి చెందారు. మరో కుమారుడు సత్తునాథ్ కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు తండ్రి ప్రభుమహారాజ్, కుమారుడు దీపక్. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు బౌన్సర్లు ఉన్నారు. బౌన్సర్లు శంషాబాద్ లో ఓ ప్రైవేట్ ఈవెంట్ ముగించుకుని కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకున్నారు. ముగ్గురు అరెస్ట్ అయ్యారు. మరో ముగ్గురు పరారయ్యారు. బౌన్సర్లంతా సంతోష్ నగర్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. మితి మీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.