Reading Time: < 1 minute

శ్రీకాళహస్తి ఆలయంలో రష్యన్ భక్తుల సందడి.. రాహుకేతువులకు విశేషంగా పూజలు

Caption of Image.

 తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయానికి విదేశీ భక్తుల తాకిడి పెరిగింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామిని 40 మంది రష్యన్ దేశస్తులు దర్శించుకున్నారు.  రష్యన్​ భక్తులకు  ఆలయ అధికారులు  దర్శన ఏర్పాట్లు కల్పించారు.  

శ్రీకాళహస్తీశ్వరుడిని  రష్యా, ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ, ఇటలీ వంటి దేశాల నుంచి వచ్చే భక్తులు సంఖ్య పెరిగింది.  ఆధ్యాత్మికతతో పాటు, రాహు-కేతు పూజలు చేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.  రాహు-కేతు పూజ విశిష్టత గురించి తెలుసుకున్న విదేశీయులు  మరీ పూజలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు గురుకుల్ నిరంజన్ స్వామి పాల్గొన్నారు..

©️ VIL Media Pvt Ltd.