
తమిళనాడు రాజకీయాల్లో పెను సంచనలం విజయ్ ఎలా గెలిచాడు.. ఎందుకు గెలిచాడు అనే కంటే.. విజయ్ గెలుపు వెనక ఉన్న సింపుల్ ఫార్ములా ఇదే అంటున్నారు.. అందుకే విజయ్ గెలుపు సాధ్యం అనేది స్పష్టం అవుతుంది.
విజయ్ పెద్ద మాటకారి కాదు.. సిగ్గు పడతాడు.. పెద్ద పెద్ద డైలాగ్స్ తో ఏమీ మాట్లాడలేదు.. జస్ట్ ఉన్నది ఉన్నట్లు చెప్పాడు.. అందుకే యువత ఆయనకు దాసోహం అన్నది. సొంత టీవీ ఛానెల్స్ ఏమీ లేదు.. జస్ట్ సోషల్ మీడియాను నమ్ముకున్నాడు. ప్రత్యర్థి పార్టీల నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగలేదు.. వ్యక్తిగతంగా ఎవర్నీ టార్గెట్ చేయలేదు. ప్రభుత్వ అవినీతిని.. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ.. తాను వస్తే ఏం చేస్తాను అనేది మాత్రమే చెప్పాడు.
తన వచ్చిన విమర్శలను పట్టించుకోలేదు.. వాటిని టచ్ కూడా చేయలేదు. టీవీ డిస్కషన్స్ లో మాట్లాడిన టీవీకే పార్టీ వాళ్లు.. ప్రభుత్వ అవినీతి, చేతగాని తనాన్ని మాత్రమే ప్రశ్నిస్తూ.. ప్రత్యామ్నాయం టీవీకే పార్టీనే అంటూ చెప్పుకొచ్చారు. ఏ పార్టీతోనే పొత్తు లేదని.. ఎవరితోనూ కలిసేది లేదని.. గెలిస్తే ప్రజా సేవ చేస్తాం.. ఓడితో ఇంట్లో కూల్చుకుంటాం అని మాత్రమే చెప్పాడు.. ఛాయిస్ మీదే అని జనానికి వదిలేశాడు.. సొంత టీవీ ఛానెల్స్ లేకపోవటం వల్ల భజన అనేది లేదు.
టివికె సంకోచం లేకుండా, రాజీపడకుండా మూడవ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నారు. ఈ ఫలితం చాలా మందికి ఆశాకిరణం, అధికారంలో ఉన్న ప్రభుత్వాలన్నింటికీ కనువిప్పు.
కేవలం కుల, మత సమీకరణాలు పనిచేయవు. తమిళనాడు డిఎంకె దాని నాయకులు, మంత్రులు.. తీవ్రమైన అవినీతి వల్ల నాశనమైంది. స్టాలిన్ ఎంతగానో ప్రయత్నించినప్పటికీ దానిని నిలబెట్టలేకపోయారు.