Reading Time: < 1 minute

ICMR లో ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 

Caption of Image.

ఐసీఎంఆర్ నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ డిజిటల్ హెల్త్ (ఐసీఎంఆర్ ఎన్ఐఆర్​డీహెచ్) ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.

  • మొత్తం ఖాళీలు: 7. 
  • విభాగాల వారీగా ఖాళీలు: ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్–II 4, ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్–-I 3.
  • ఎలిజిబిలిటీ
  • ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్-II: సైన్స్ సబ్జెక్టులతో 12వ తరగతి ఉత్తీర్ణత, మెడికల్ లాబొరేటరీ టెక్నీషియన్‌లో డిప్లొమా/ పీఎండబ్ల్యూలో డిప్లొమా, రేడియాలజీ/ రేడియోగ్రఫీ లేదా సంబంధిత సబ్జెక్టులో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థలో ఏడాది అనుభవం ఉండాలి. 
  • ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్–I: 10వ తరగతి ఉత్తీర్ణత, ఎంఎల్​టీ/ డీఎంఎల్ టీ/ ఐటీఐ లేదా సమాన డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. కనీసం రెండేండ్ల అనుభవం ఉండాలి. 
  • గరిష్ట వయోపరిమితి: 30 ఏళ్లు.  
  • అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
  • వాక్​ఇన్ ఇంటర్వ్యూ: మే 12. 
  • సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
  • మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.icmr.gov.inను సందర్శించండి. 
     
©️ VIL Media Pvt Ltd.