
కరీంనగర్ లోని PMJ జ్యుయలరీ షోరూంలో చోరీ ఘటనపై సీపీ గౌస్ ఆలం స్పందించారు. చోరీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. చోరీలో మొత్తం ఐదుగురు దొంగలు పాల్గొన్నట్లు తెలిపారు. షాపులో ఉన్న సుమారు కిలో బంగారం చోరీకి గురైనట్లు వెల్లడించారు. నిందితుల్లో నలుగురు తుపాకులతో షాపులోకి ప్రవేశించి సిబ్బంది, కస్టమర్లపై కాల్పులు జరిపారని తెలిపారు. దొంగల కాల్పుల్లో షాపు సిబ్బంది గాయపడ్డారు.. వారు ప్రస్తుతం సేఫ్ గా ఉన్నారని సీపీ తెలిపారు.
దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయన్నారు సీపీ.కమాండ్ కంట్రోల్ రూం తోపాటు నగరంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నాం.. కరీంనగర్ లోని అన్ని హోటల్స్ లో తనిఖీలు చేపట్టామన్నారు సీపీ గౌస్ ఆలం. అతి త్వరలో దొంగలను పట్టుకుంటామన్నారు.
ఆదివారం (మే3) కరీంనగర్ లోని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటిముందే భారీ చోరీ ఘటన సంచలనం రేపుతోంది. సంఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో బండిసంజయ్ సీసీ రోడ్డు పనులకు శంకుస్తాపన చేశారు.. అప్పటివరకు ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఉంది.. అయినప్పటికి PMJ జ్యువెలరీ షోరూంలో చోరీ జరగడం చర్చనీయాంశంగా మారింది. నలుగురు దొంగలు తుపాకులతో షాపులోకి చొరబడి తుపాలకులతో బెదిరించి చోరీకి పాల్పడ్డారు. దొంగలను అడ్డుకునేందుకు యత్నించిన షాపు సిబ్బందిపై దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో షాపు మేనేజర్ ఎండీ ముస్తాక్ కు తీవ్రగాయాలయ్యాయి. సిబ్బంది మధుకర్, కస్తూరి కమలహాసన్, సెక్యూరిటీ గార్డు అరుల రాజేష్ కు బుల్లెట్ గాయాలయ్యాయి. దొంగలను పట్టుకునేందుకు పోలీస్ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.