Reading Time: 2 minutes

కిచెన్ తెలంగాణ: బయట ఐస్క్రీమ్స్ కూడా కల్తీ అవుతున్నయ్.. అందుకే ఫ్రూట్ ఐస్ క్రీమ్లు.. ఇలా ఇంట్లో చేస్కోండి!

Caption of Image.

ఇంట్లో చేసే రెసిపీ ఏదైనా బయటి వాటితో పోటీ పడలేదు. హోమ్​ మేడ్ రుచే వేరు. ఐస్ క్రీమ్​లోనూ అంతే.. ఫ్లేవర్స్​ మారొచ్చు. కానీ ఫేవరేట్ మాత్రం హోమ్​ మేడ్ ఐస్ క్రీమ్​ అనేలా ఉంటాయి. బయటి ఫుడ్ అవాయిడ్ చేయడానికి, ఇంట్లో ఫుడ్​ టేస్ట్​కి అలవాటు పడడానికి ఇది బెస్ట్​ ఐడియా. పైగా ప్రాసెస్​ కూడా సింపుల్​. సో… ఇక్కడున్న ఈ మూడు ఐస్​ క్రీమ్​లను కూడా మీ విష్​లిస్ట్​లో వేసుకోండి. ఇంట్లోనే తయారుచేసుకుని ఈ సమ్మర్​లో చిల్​ అవ్వండి. 

కర్బూజతో..

కావాల్సినవి :కర్బూజ – ఒకటి
చక్కెర – రెండు టేబుల్ స్పూన్లు
కార్న్​ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్
పాలు – ఒక కప్పు
విప్పింగ్ క్రీమ్ – ఒక కప్పు

తయారీ : కర్బూజ కట్ చేసి గింజలు తీసేసి, మిక్సీజార్​లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అందులో చక్కెర వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమం దగ్గరపడేవరకు ఉడికించాలి. ఒక గిన్నెలో కార్న్​ఫ్లోర్ వేసి పాలు పోసి బాగా కలపాలి. ఆపై మిశ్రమం దగ్గరపడేవరకు ఉడికించాలి. ఒక గిన్నెలో విప్పింగ్ క్రీమ్ వేసి విస్కర్​తో బీట్ చేయాలి. దాంట్లో అప్పటికే చల్లారిన కర్బూజ గుజ్జు, పాల మిశ్రమం వేసి మరోసారి అన్నీ కలిసేలా కలపాలి. కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో పెట్టి పైన కవర్​ చేసి ఫ్రిజ్​లో పెట్టాలి. రాత్రంతా ఫ్రిజ్​లో పెడితే, మరుసటి రోజు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. 

అరటిపండుతో..

కావాల్సినవి :
పండిన అరటి పండ్లు – రెండు
పాలు – ఒక టీస్పూన్
డ్రైఫ్రూట్స్ – సరిపడా
    
తయారీ:
అరటి పండ్ల ముక్కలను ఒక జిప్​లాకర్​ కవర్​లో వేసి గంటసేపు ఫ్రిజ్​లో పెట్టాలి. ఆ తర్వాత వాటిని మిక్సీజార్​లో వేసి పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆపై దాన్ని ఒక బాక్స్​లో పెట్టి గాలిచొరబడకుండా మూతపెట్టి, ఫ్రిజ్​లో పెట్టాలి. గంట తర్వాత తీసి, దానిపై డ్రైఫ్రూట్స్ చల్లుకుని తింటే టేస్టీగా ఉంటుంది.

కొబ్బరితో..

కావాల్సినవి :లేత కొబ్బరి – ఒక  కప్పు
క్రీమ్ – ఒక  కప్పు
చక్కెర పొడి – మూడు టేబుల్ స్పూన్లు
పాలు – అర కప్పు

తయారీ :ఒక గిన్నెలో క్రీమ్ వేసి దాన్ని విస్కర్​తో బాగా కలపాలి. తర్వాత అందులో చక్కెర పొడి వేసి మరోసారి కలపాలి. పాలు, సన్నగా తరిగిన కొబ్బరి వేయాలి. ఆ మిశ్రమాన్ని వేసి మూతపెట్టి, దాదాపు ఏడు గంటలు ఫ్రిజ్​లో పెట్టాలి. ఆ తర్వాత తీసి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

©️ VIL Media Pvt Ltd.