Reading Time: < 1 minute

ఆధార్ కార్డులో బర్త్ డేట్ అప్డేట్ చేసుకోవాలా..! ఈ ఐదు డాక్యుమెంట్లు తప్పనిసరి

Caption of Image.

ఆధార్ కార్డు.. ఇది లేకుండా ఇప్పుడు ఏ పనిజరగదు..  ప్రభుత్వ సంక్షేమ పథకాలనుంచి ప్రయివేట్ సంస్థల వరకు, పిల్లల ఎడ్యుకేషన్ నుంచి ఉద్యోగం వరకు గుర్తింపుకు ఇది తప్పనిసరి. అయితే ఇందులో వ్యక్తిగత వివరాలు సరిగా ఉంటేనే అన్ని సవ్యంగా సాగుతాయి. లేదంటే ఇబ్బందుల్లో పడ్డట్లే. ఇలాంటి  సందర్భాల్లో ఆధార్ కార్డులోని వివరాలను అప్డేట్ చేసుకునేందుకు ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసింది.. అయితే  అప్డేట్స్ విషయంలో ఎప్పటికప్పుడు కొన్ని రూల్స్ లో మార్పులు  చేస్తూ వస్తోంది ఆధార్ కార్డు జారీ చేసే సంస్థ ఉడాయ్.. తాజాగా పుట్టిన తేదీ అప్డేట్ విషయంలో కొత్త రూల్స్ తీసుకొచ్చింది.. డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసేందుకు ఐదు రకాల డాక్యుమెంట్లను వినియోగించుకోవచ్చని తెలిపింది.. అవేంటో చూద్దాం.. 

ఆధార్ కార్డులో డిస్ ప్లేఅయ్యే వివరాల్లో పుట్టిన తేదీ (DoB) చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది వివిధ అధికారిక ప్రయోజనాల కోసం గుర్తింపు ,వయస్సుకు రుజువుగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వ పథకాలను పొందడానికి, బ్యాంకు ఖాతాలను తెరిచేందుకు గుర్తింపుగా వినియోగిస్తాం. అందుకే వ్యక్తులు తమ ఆధార్ కార్డులోని సమాచారం ఖచ్చితమైనదిగా  అప్డేటెడ్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఆధార్ కార్డులో పుట్టిన తేదీని అప్డేట్ చేసుకునేందుకు ఐదు రకాల డాక్యుమెంట్లను తప్పనిసరి చూపించాల్సి ఉంటుంది. 

►ALSO READ | భగవద్గీత మతపరమైన గ్రంథమా? యుద్ధభూమిలో ఉపదేశం ఏంటి?

ఆధార్ కార్డులో పుట్టిన తేదీని అప్డేట్ కు  బర్త్ సర్టిఫికెట్, పాస్ పోర్టు, సర్వీస్ ఫొటో గుర్తింపు కార్డు,  గుర్తింపు పొందిన ఎడ్యుకేషనల్ బోర్డు జారీ చేసిన మార్క్‌షీట్/సర్టిఫికేట్ వంటి ఐదు రకాల డాక్యుమెంట్లను చూపించి అప్డేట్ చేసుకోవచ్చని ఉడాయ్ తెలిపింది. మీకు దగ్గరలో ఉన్న ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి ఈ  ఐదురకాల  డాక్యుమెంట్లను సమర్పించి బయోమెట్రిక్ ద్వారా డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవచ్చు. 

©️ VIL Media Pvt Ltd.