
ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించారు. ఇటీవల పవన్ కళ్యాణ్‌కు సర్జరీ జరగడంతో వైద్యుల సూచన మేరకు ఆయన ప్రస్తుతం తన హైదరాబాద్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు మే 2న నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
సుమారు కొంతసేపు పవన్ కళ్యాణ్‌తో మాట్లాడిన చంద్రబాబు సర్జరీ తర్వాత కోలుకుంటున్న తీరును, వైద్యులు అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్.. ప్రస్తుతానికి రాజకీయ కార్యక్రమాలకు కాస్త విరామం ఇచ్చి, పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోవాలని కోరారు.
పవన్ కళ్యాణ్కు జరిగిన సర్జరీ
ఏప్రిల్ 17న అధికారులతో సమావేశంలో పాల్గొంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షలు నిర్వహించి MRI స్కాన్ ద్వారా సైనసైటిస్ సమస్య తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు. (సైనసైటిస్: ముఖ ఎముకలలోని గాలి గదులు వాపునకు గురై, శ్లేష్మం పేరుకుపోవడం వల్ల కలిగే ఇన్‌ఫెక్షన్)
►ALSO READ | సాగర్ నీళ్ల ఇష్యూ.. ఇప్పటికే 680 టీఎంసీలు వాడేసిన ఏపీ.. ఇక మిగిలింది 28 టీఎంసీలే
ఈ క్రమంలోనే ఆయనకు ముక్కుకు సంబంధించిన ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. అదే రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ ను డిశ్చార్జ్ చేశారు. కనీసం వారం నుంచి పది రోజుల పాటు రెస్ట్ అవసరమ డాక్లర్లు సూచించారు. అయితే, సైనసైటిస్‌కు శస్త్రచికిత్స తర్వాత కూడా జాగ్రత్తలు తప్పనిసరి, లేకపోతే వయస్సు పెరిగే కొద్దీ శ్వాస సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచించారు.