Reading Time: < 1 minute

4 నెలల్లోనే 5 వేల మంది సందర్శన.. బాసర IIIT వరల్డ్ రికార్డ్

Caption of Image.

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీకి అరుదైన ఘనత దక్కింది.  అవును  తక్కువ సమయంలోనే  అత్యధిక సంఖ్యలో ఇతర విద్యాసంస్థల విద్యార్థులు సందర్శించిన యూనివర్సిటీగా బాసర ట్రిపుల్ ఐటీ సంచలన రికార్డు సృష్టించింది. 2025 డిసెంబర్ నుంచి మార్చి 13, 2026 వరకు.. అంటే కేవలం కొన్ని నెలల్లోనే ఏకంగా 4,966 మంది బయటి విద్యార్థులు ఈ క్యాంపస్‌ను సందర్శించారు.

ఈ అద్భుత గణాంకాలను గుర్తించిన యుఎస్ఏ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ (USA Book of World Records) సంస్థ.. బాసర ట్రిపుల్ ఐటీకి అధికారిక ప్రపంచ రికార్డును ప్రకటించింది. ఈ ఘనతకు గుర్తుగా ఆ సంస్థ ప్రతినిధులు యూనివర్సిటీకి అధికారిక ధ్రువపత్రం, పతకం ట్రోఫీని అందజేశారు.

►ALSO READ | జయంతి ఉత్సవాలకు రండి..మంత్రి సురేఖకు కొండగట్టు ఈవో ఆహ్వానం

ఈ అరుదైన అవార్డు రావడంపై వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్థన్  హర్షం వ్యక్తం చేశారు. విద్యాబోధనతో పాటు మౌలిక సదుపాయాలు, విజ్ఞాన పంపిణీలో బాసర ట్రిపుల్ ఐటీ అగ్రగామిగా నిలుస్తోందని ఈ రికార్డు నిరూపించిందని ఆనందం వ్యక్తం చేశారు. 

©️ VIL Media Pvt Ltd.