
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం. బీమా.. ఇన్సూరెన్స్ రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు లైన్ క్లియర్ చేసింది. బీమా కంపెనీల్లో FDI.. అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నిర్ణయంతో.. బీమా రంగంలో విదేశీ పార్టనర్ షిప్.. అంటే మన దేశంలోని ఇన్సూరెన్స్ కంపెనీల్లో ప్రత్యక్షంగా విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టటానికి అవకాశం లభిస్తుంది.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. LIC మాత్రం విదేశీ పెట్టుబడులను 20 శాతానికి పరిమితం చేసింది కేంద్రం. LICలో 20 శాతానికి మించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టటానికి అవకాశం లేకుండా నిబంధన తీసుకొచ్చింది కేంద్రం.
భారతీయ బీమా.. ఇన్సూరెన్స్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే విదేశీ కంపెనీలు.. భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటీ నుంచి లైసెన్సులు తీసుకోవాలి. 1939 బీమా చట్టానికి లోబడి ఉండాలి అని స్పష్టం చేస్తూ.. కేబినెట్ నిర్ణయం తీసుకున్నది.
విదేశీ పెట్టుబడులు ఉండే భారతీయ బీమా కంపెనీలో చైర్ పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.. ఈ మూడు పదవుల్లో ఒకరు కచ్చితంగా భారత పౌరుడి.. భారతదేశంలో నివసించే భారతీయులు అయ్యి ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది.
#NewsAlert | India notifies 100% FDI in insurance firms via the automatic route (Agencies)#FDI #InsuranceSector #LIC #IndiaPolicy #EconomicReforms pic.twitter.com/QAWLImcfnT
— ET NOW (@ETNOWlive) May 2, 2026