
సెంట్రల్ ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఏఆర్ఐ) సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
పోస్టు పేరు: సీనియర్ రీసెర్చ్ ఫెలో.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎం.ఫార్మా, బి.టెక్/ బీఈ, ఎంఎస్సీ, బీఎస్సీ పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 35ఏళ్లు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
వాక్ఇన్ ఇంటర్వ్యూ: మే 7.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ ccras.nic.inను సందర్శించండి.