
ఈ కాలంలో చాలా మంది రసాయనాలు/ కెమికల్స్ లేని సహజమైన అలవాట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండటానికి ఆయుర్వేద పద్ధతులను ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగా, మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కాకరకాయ (కరేలా), నేరేడు (జామున్) అద్భుతంగా పనిచేస్తాయి. ఈ రెండింటితో పతంజలి వారు అందించే ‘కరేలా జామున్ 50-50 జ్యూస్’ ఎంతో మేలు చేస్తుంది.
రసాయన పానీయాల కంటే
మార్కెట్లో దొరికే కృత్రిమ పానీయాలు జీర్ణక్రియను పాడుచేస్తాయి. కానీ, ఈ ఆయుర్వేద జ్యూస్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజంగా పనిచేస్తుంది. ఇది శరీరాన్ని లోపల నుండి శుభ్రం చేయడానికి (డిటాక్స్), షుగర్ లెవల్స్‌ను బ్యాలెన్స్ ఉంచడానికి తోడ్పడుతుంది.
ఈ జ్యూస్ వల్ల కలిగే లాభాలు
*రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో ఇది చాలా పవర్‌ఫుల్.
*పొట్ట సంబంధిత సమస్యలను తగ్గించి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
*శరీరంలోని విషపూరిత పదార్థాలను బయటకు పంపుతుంది.
*ఈ జ్యూస్ రోజూ తాగడం వల్ల వ్యాధులపై పోరాడే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
*లివర్ ఆరోగ్య పనితీరును మెరుగుపరచడానికి ఇది ఎంతో ఉపయోగకరం.
కాకరకాయ, నేరేడు పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ డయాబెటిక్ గుణాలు మన శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతూ ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్రతిరోజూ ఉదయం పరగడుపున/ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం మంచిది. 10 నుంచి 20 మిల్లీలీటర్ల మోతాదులో ఈ జ్యూస్‌ను తీసుకోండి. ఎంత జ్యూస్ తీసుకుంటారో, అంతే పరిమాణంలో నీటిని కలిపి తాగాలి.
ప్రతిరోజు తప్పకుండా ఈ జ్యూస్ తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉండటమే కాకుండా, పూర్తి ఆరోగ్యం మీ సొంతమవుతుంది. మీరు ఇప్పటికే ఏదైనా ఆరోగ్య సమస్యకు మందులు వాడుతున్నట్లయితే, ఈ జ్యూస్ మొదలుపెట్టే ముందు ఒకసారి వైద్యుడిని సంప్రదించడం మంచిది.