Reading Time: 2 minutes

తండ్రి హిందూ To ముస్లిం.. తల్లి ముస్లిం To హిందూ.. ఫరియా అబ్దుల్లా ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ స్టోరీ!

Caption of Image.

టాలీవుడ్ చిట్టి గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి ఫరియా అబ్దుల్లా.  ‘జాతి రత్నాలు’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది ఈ పొడుగుకాళ్ల సుందరి. ఈ తెలుగు ముద్దుగుమ్మ కేవలం గ్లామర్ తోనే కాకుండా.. తన అద్భుతమైన నటన, కామెడీ టైమింగ్ తో సినీ ప్రియులను కట్టిపడేసింది. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకెళ్లోంది. అయితే వెండితెరపై అలరించే ఈ బ్యూటీ వెనుక ఉన్న వ్యక్తిగత నేపథ్యం, ఆమె పెరిగిన ఇంటి వాతావరణం ఇప్పుడు నెట్టింట్ హాట్ టాపిక్ గా మారింది.

ఒకే ఇంట్లో రెండు మతాలు..

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఫరియా తన కుటుంబం నేపథ్యం గురించి పంచుకున్న విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఒకే ఇంట్లో భిన్నమైన విశ్వాసాలు, ఆచారాలు ఎంత సామరస్యంగా ఉంటాయో ఆమె తమ మాటలతో వివరించారు. తన తండ్రి హిందూ కుటుంబంలో జన్మించినప్పటికీ, యవ్వనంలో ఇస్లాం సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై ఆ మతంలోకి మారారని ఫరియా చెప్పుకొచ్చారు.. మరోవైపు, ఆమె తల్లి ముస్లిం కుటుంబంలో జన్మించారు. అయితే ఆమె తన 30 ఏళ్ల వయసులో హిందూ ధర్మంపై మక్కువ పెంచుకుని, ఆధ్యాత్మికత, ధ్యానం పట్ల ఆకర్షితురాలయ్యారని తెలిపారు..

ఆంక్షలకు నో..

మా కుటుంబంలో మతపరమైన ఆంక్షలు ఎప్పుడూ లేవు అని ఫరియా వివరించారు.  నా తల్లిదండ్రులు ఇద్దరూ విభిన్న మతాలు, సంప్రదాయల నుంచి వచ్చినప్పటికీ, మాకు కేవలం మానవత్వం, దయ, సానుభూతిని మాత్రమే నేర్పించారు. అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని, మతం కంటే మంచితనం ముఖ్యమని మాకు అర్థమైంది అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఫరియా వీడియో నెట్టింట్ వైరల్ అవుతోంది.

పక్కా హైదరాబాదీగా.. 

అచ్చమైన హైదరాబాదీ అయిన ఫరియాకు నటన మాత్రమే కాదు .. పెయింటింగ్, బ్రేక్ డ్యాన్సింగ్, సంగీతం అంటే ఎంతో ప్రాణం. కేవలం నటిగా మాత్రమే కాకుండా ఒక కళాకారిణిగా ఎదగడమే  తన లక్ష్యం అని ఈ ముద్దుగమ్మ స్పష్టం చేశారు. సినీ ఇండస్ట్రీలో పొడుగు కాళ్ల సందరిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. సాధారణంగా హీరోయిన్లు తనకంటే ఎత్తుగా ఉంటే హీరోలు ఇబ్బంది పడతారని అంటుంటారు, కానీ ఫరియా ఆ మూస ధోరణిని చెరిపేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

‘గాయపడ్డ సింహం’గా విశ్వరూపం

ఇప్పటివరకు సరదా పాత్రలతో మెప్పించిన ఫరియా, ఇప్పుడు రూటు మారుస్తోంది. మే 1, 2026న విడుదల కానున్న ‘గాయపడ్డ సింహం’ సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో ఆమె ఒక ఇంటెన్స్, సీరియస్ పాత్రలో కనిపించనుంది. తనను కేవలం కామెడీ పాత్రలకే పరిమితం చేయకుండా, తనలో ఉన్న అసలైన నటిని ఈ సినిమా బయటపెడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తుందీ బ్యూటీ..

 

©️ VIL Media Pvt Ltd.