
నిజామాబాద్, వెలుగు: ప్రతి రోజు న్యూస్పేపర్లను ఇంటింటికీ పంపిణీ చేస్తూ చాలీచాలని ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్న తమను గిగ్వర్కర్లుగా గుర్తించాలని స్టేట్ప్రింట్మీడియా డిస్ట్రిబ్యూషన్ఏజెంట్స్అసోసియేషన్ప్రతినిధులు కోరారు. శుక్రవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్వివేక్ వెంకటస్వామిని కలిసి అందజేసిన వినతిపత్రాన్ని వారు శనివారం నిజామాబాద్లో మీడియాకు రిలీజ్చేశారు. పత్రికా వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి దీనిపై ఆధారపడి రాష్ట్రంలో 30 వేల మంది ఏజెంట్లు, హాకర్స్, పేపర్బాయ్స్ పనిచేస్తున్నారని తెలిపారు.
కర్ణాటకలో ఇస్తున్నట్లు జనరల్, మెడికల్ఇన్సూరెన్స్, టూవీలర్స్కొనుగోలుకు బ్యాంక్లోన్ఇవ్వాలన్నారు. సమాజ సేవకులుగా గుర్తించి తమకు కార్పొరేషన్లేదా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా కేంద్రాల్లో మీటింగ్హాల్స్నిర్మించి ఇవ్వాలని, ప్రతి జిల్లాలో కోఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేసి సబ్సీడీ లోన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్స్టేట్ప్రెసిడెంట్వనమాల సత్యం, వైస్ప్రెసిడెంట్డి.లింగమూర్తి, సెక్రటరీ యామిని మధుసూదన్, ఆర్గనైజింగ్సెక్రటరీ వెన్న రవి తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్లో చేరిన మాజీ ఎంపీపీ
కాగజ్ నగర్, వెలుగు: ఆసిఫాబాద్జిల్లా కౌటాల మండలానికి చెందిన మాజీ ఎంపీపీ బసర్కార్ విశ్వనాథ్ శనివారం మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ప్రజా ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు అందేలా పనిచేయాలని మంత్రి సూచించారు. నాయకులు అర్షద్ హుస్సేన్ తదితరులున్నారు.