Reading Time: < 1 minute

మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ కుట్రే : టీజేఎస్ చీఫ్ కోదండరాం

Caption of Image.
  • టీజేఎస్ చీఫ్ కోదండరాం వ్యాఖ్య

బషీర్‌‌బాగ్, వెలుగు: మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లును ముందుకు తేవడం కుట్రపూరిత చర్య అని కేంద్రంపై టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. మహిళా బిల్లుకు తాము పూర్తి అనుకూలమని, కానీ దాని అమలును డీలిమిటేషన్‌‌తో ముడిపెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమని స్పష్టం చేశారు. శనివారం బషీర్‌‌బాగ్‌‌లోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనికి కోదండరాం హాజరై మాట్లాడారు. డీలిమిటేషన్​తో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం జరుగుతోందన్నారు. 

సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న సీట్లలోనే మహిళా కోటా అమలు చేయాలని సూచించారు. జనగణనను అడ్డుకోవడమే బీజేపీ ప్రభుత్వ ఉద్దేశమని సీపీఐ జాతీయ నాయకురాలు పశ్య పద్మ విమర్శించారు. మెజారిటీ ఉందన్న అహంకారంతో బీజేపీ రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మండిపడ్డారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల సీట్ల శాతం తగ్గే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. 

©️ VIL Media Pvt Ltd.