Reading Time: < 1 minute

ఇటు సీఎం ప్రోగ్రాం.. అటు తిరంగా ర్యాలీ.. ఇవాళ (ఆగస్ట్ 14) హైదరాబాద్ సిటీలోట్రాఫిక్ ఆంక్షలు 

Caption of Image.

హైదరాబాద్ సిటీ, వెలుగు : నెక్లెస్ రోటరీ సమీపంలోని లేక్ వ్యూ పార్క్ వద్ద శుక్రవారం సాయంత్రం 4 గంటలకు జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణకు సీఎం రేవంత్​రెడ్డి వస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రోగ్రాం పూర్తయ్యే వరకు ట్రాఫిక్​ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్  తెలిపారు. సెక్రటేరియేట్​వైపు నుంచి ఐ-మాక్స్ వైపు వెళ్లడానికి అనుమతి లేదని, ఈ రూట్​లో వచ్చే వాహనాలను ఖైరతాబాద్ ఫ్లైఓవర్, వీవీ విగ్రహం వైపు మళ్లిస్తామన్నారు.

నెక్లెస్ రోడ్ (పీపుల్స్ ప్లాజా), ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు నుంచి ఐ-మాక్స్ వైపు వెళ్లడానికి వీల్లేదు. వీరు సెక్రటేరియేట్​వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్బాల్ మినార్ నుంచి చెట్టు, మింట్ కాంపౌండ్, ప్రింటింగ్ ప్రెస్, నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను సచివాలయం జంక్షన్ వైపు పంపిస్తారు. బడా గణేశ్​లైన్​ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను మింట్ కాంపౌండ్ లైన్​కు మళ్లిస్తారు.  

తిరంగా ర్యాలీతో..

ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌ అంబేద్కర్ విగ్రహం నుంచి చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని ఎం-47 ప్యాటన్ ట్యాంక్ వరకు తిరంగా ర్యాలీ దృష్ట్యా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ట్రాఫిక్​ ఆంక్షలు ఉంటాయి. కర్బాలా మైదాన్ వైపు నుంచి అప్పర్ ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్ వైపు వెళ్లే వాహనాలను సెయిలింగ్ క్లబ్ వద్ద కవాడిగూడ వైపునకు, డీబీఆర్ మిల్స్ వైపు నుంచి వచ్చే వాహనాలను గోశాల  కవాడిగూడ వైపు మళ్లిస్తారు.  

©️ VIL Media Pvt Ltd.