Reading Time: < 1 minute

‘తెలంగాణపై బీజేపీ విషం కక్కుతోంది’ : డీసీసీ ప్రెసిడెంట్పిన్నింటి రఘునాథ్రెడ్డి 

Caption of Image.

కోల్​బెల్ట్, వెలుగు: కోట్లాది ప్రజల ఆకాంక్షలను గౌరవించి సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ ఇస్తే బీజేపీ విషం కక్కుతోందని మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్​పిన్నింటి రఘునాథ్​రెడ్డి మండిపడ్డారు. శనివారం క్యాతనపల్లిలో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య దిష్టిబొమ్మను కాంగ్రెస్​నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా రఘునాథ్​రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణను కించపర్చేలా మాట్లాడిన ఎంపీ తేజస్వీ సూర్యతోపాటు  బీజేపీ తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పించాలని డిమాండ్​ చేశారు.

తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సహించబోమని హెచ్చరించారు. దిష్టిబొమ్మ దహనం చేశారు. క్యాతనపల్లి టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్​పల్లె రాజు, బ్లాక్ ​కాంగ్రెస్​ ప్రెసిడెంట్​రాజయ్య, జిల్లా సెక్రటరీ బానేశ్, కౌన్సిలర్లు, నేతలు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.