
రష్మిక మందన్న లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘మైసా’. గోండ్ గిరిజన అమ్మాయిగా నటిస్తున్న రష్మిక ఇందులోని పాత్రను ఓ ఛాలెంజ్‌గా తీసుకుంది. ఈ పాత్రకు ఎమోషనల్ డెప్త్‌తో పాటు శారీరక దృఢత్వం అవసరం. దీంతో ఆమె బ్యాంకాక్‌కు వెళ్లి కఠినమైన స్టంట్, కాంబాట్ ట్రైనింగ్ తీసుకుంటోంది. రియల్‌గా కనిపించే యాక్షన్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడమే లక్ష్యంగా రోజుకు దాదాపు ఎనిమిది గంటల పాటు అడ్వాన్స్‌డ్ స్టంట్స్, హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్, హై స్పీడ్ యాక్షన్ టెక్నిక్స్ నేర్చుకుంటోంది.
త్వరలో కేరళలో 16 రోజుల పాటు కీలక యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇంటర్నేషనల్ యాక్షన్ డైరెక్టర్ ఆండి లాంగ్ పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈశ్వరి రావు, గురు సోమసుందరం, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.