Reading Time: < 1 minute

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల లబ్దికోసమే..మహిళ బిల్లు హడావుడి: ప్రియాంకగాంధీ

Caption of Image.

లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై వాడీ వేడి చర్చ జరిగింది. మహిళల హక్కుల కోసం మొదటి నుంచి పోరాటం చేసింది ఒక్క కాంగ్రెస్ పార్టీనే.. మహిళ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దిపై ఎలాంటి అవసరం లేదు.. మహిళా బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రధాని మోదీ చెప్పడం హస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు.  

మహిళలకు రిజర్వేషన్ విషయంలో మొదట చట్టబద్దత కల్పించింది  కాంగ్రెస్  హయాంలో అన్నారు  ప్రియాంకగాంధీ. రాజీవ్ గాంధీ పంచాయతీల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించారని గుర్తు చేశారు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం లో మహిళలు ఉన్నత పదవుల్లో ఉన్నారని సభకు తెలిపారు. దేశానికి తొలి మహిళా ప్రధానిని అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. 

 మహిళ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మద్దతు ఇస్తూనే ఉందన్నారు ప్రియాంకగాంధీ. 2018లో  మహిళా రిజర్వేషన్లపై ప్రధాని మోదీకి  రాహుల్ గాంధీ లేఖ రాసిన విషయం సభకు గుర్తు చేశారు. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు తెలిపిందన్నారు. 

►ALSO READ | ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఆకాసా ఎయిర్ విమానాన్ని ఢీకొన్న స్పైస్ జెట్ విమానం

మహిళా రిజర్వేషన్ బిల్లు తామే తెచ్చినట్లు బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం డ్రామాలాడుతోందన్నారు ప్రియాంక.  ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల జరుగుతున్నందున రాజకీయంగా లబ్ధి పొందేందుకు మహిళ రిజర్వేషన్ బిల్లు హడావుడి చేస్తున్నారని విమర్శించారు. మహిళ రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ కోటాపై ఎలాంటి స్పష్టత లేదన్నారు.మోదీ సర్కార్ తెచ్చిన ఈ బిల్లుతో కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుందన్నారు ప్రియాంక గాంధీ. 

ఓబీసీలకు న్యాయం చేసే ఉద్దేశం మోదీ సర్కార్ కు లేదన్నారు ప్రియాంక. ఓబీసీ హక్కుల రక్షణకు మోదీ సర్కార్ చేసిందేమీ లేదని విమర్శించారు. ఎవరి అభిప్రాయం తీసుకోకుండానే డీలిమిటేషన్, నియోజకవర్గాల విభజన బిల్లును తెచ్చారని మండిపడ్డారు. మరోసారి దేశ ప్రజల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు.  ‘‘మీ నీతి చాణక్య నీతి కూడా పనికి రాదంటూ’’ ప్రధాని మోదీకి చురకలంటిచారు ప్రియాంక. 

©️ VIL Media Pvt Ltd.