Reading Time: < 1 minute

బొట్టు, కంకణం పై లెన్స్‌కార్ట్‌లో నిషేధం ?: సోషల్ మీడియాలో రచ్చ.. అసలు నిజం ఇదీ!

Caption of Image.

 ప్రముఖ ఐవేర్ సంస్థ లెన్స్‌కార్ట్ (Lenskart) చుట్టూ సోషల్ మీడియాలో ఓ పెద్ద వివాదం చెలరేగింది. కంపెనీ ఉద్యోగులను బొట్టు, తిలకం ధరించకూడదని నిబంధన పెట్టిందనే వార్త వైరల్ కావడమే దీనికి కారణం.  దీనికంటే ముందు సోషల్ మీడియాలో లెన్స్‌కార్ట్ కంపెనీకి చెందిన ఒక పాత నిబంధన బయటకు వచ్చింది. అందులో ఉద్యోగులు హిజాబ్ ధరించవచ్చని, కానీ బొట్టు, తిలకం లేదా చేతికి కంకణాలు  కట్టుకోకూడదని ఉన్నట్లు చూపిస్తుంది. ప్రముఖ రచయిత్రి షెఫాలీ వైద్య దీనిపై స్పందిస్తూ, భారతదేశంలో ఉంటూ హిందూ సంప్రదాయాలను నిషేధించడం ఏంటి ? అని ప్రశ్నించారు.

నెటిజన్ల ఆగ్రహం
ఈ వార్త తెలియగానే సోషల్ మీడియాలో లెన్స్‌కార్ట్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. హిజాబ్‌కు లేని అభ్యంతరం బొట్టుకు ఎందుకు? అని కొందరు ప్రశ్నించగా.. ఇకపై మేము లెన్స్‌కార్ట్‌లో ఎలాంటి వస్తువులు కొనము అంటూ మరికొందరు బైకాట్ లెన్స్‌కార్ట్ అంటూ  పిలుపునిచ్చారు. అంతేకాకుండా కంపెనీ హిందూ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని నెటిజన్లు మండిపడ్డారు.

►ALSO READ | ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల లబ్దికోసమే..మహిళ బిల్లు హడావుడి: ప్రియాంకగాంధీ

లెన్స్‌కార్ట్ వ్యవస్థాపకుడి క్లారిటీ
ఈ వివాదం కాస్త పెద్దది కావడంతో లెన్స్‌కార్ట్ ఫౌండర్ పీయూష్ బన్సల్ స్వయంగా రంగంలోకి దిగి క్లారిటీ  ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నియమం పాతదని, అది ఇప్పటి కంపెనీ నిబంధనలని ఆయన స్పష్టం చేశారు. లెన్స్‌కార్ట్ ఉద్యోగులు బొట్టు పెట్టుకున్నా, తిలకం ధరించినా కంపెనీకి ఎటువంటి అభ్యంతరం లేదని, మతపరమైన భావప్రకటనలపై ఎటువంటి నిషేధం లేదని చెప్పారు. పాత రూల్స్ గైడ్ లైన్స్  వల్ల కలిగిన ఆందోళనకి  క్షమాపణలు కోరుతున్నట్లు చెప్పారు.

లెన్స్‌కార్ట్‌ను భారతీయుల కోసం భారతీయులే నిర్మించారు. ఇదొక భారతీయ కంపెనీ.. మా వేల మంది ఉద్యోగులు సంప్రదాయాలను గర్వంగా పాటిస్తారు. నేను కూడా ఎప్పటికీ గౌరవిస్తాను అని ఆయన ట్వీట్ చేశారు.

©️ VIL Media Pvt Ltd.