
అక్కినేని అఖిల్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘లెనిన్’ (Lenin). ట్రెండింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. ఈ మూవీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత ఈసారి ఖచ్చితంగా సక్సెస్ అందుకోవాలనే లక్ష్యంతో అఖిల్, భాగ్యశ్రీ ఉన్నారు. అంచనాలకు తగ్గట్టుగానే డైరెక్టర్ మురళీ కే కిషోర్ పక్కా మాస్, యాక్షన్ రూరల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ‘గ్లింప్స్, ఫస్ట్ సాంగ్ వారెవ్వా’ మంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ క్రమంలోనే మేకర్స్ సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. “యెట్టా యెట్టా యెట్టా.. ఎట్టా ఎట్టా గా” అంటూ సాగే వీడియో సాంగ్ ఆకట్టుకుంటుంది. అఖిల్-భాగ్యశ్రీల క్యూట్ స్టెప్పులు మెస్మరైజ్ చేసే విధంగా ఉన్నాయి. తమన్ కంపోజ్ చేసిన ఈ పాటకు భాస్కర్ భట్ల వినసొంపైన లిరిక్స్ అందించారు. తమన్తో పాటుగా శ్రీ కృష్ణ పాడారు.
ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతుంది. చిత్తూరు ప్రాంతపు కథాంశంతో తెరకెక్కుతోందని టాక్. ఎమోషనల్ లవ్ స్టోరీ, హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా ఉండేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు మురళీ కిషోర్. అన్నపూర్ణ స్టూడియోస్తో పాటు, సితార ఎంటర్టైన్మెంట్స్సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ అంచనాల మధ్య ఈ సినిమా జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
►ALSO READ | రణబీర్ కపూర్ కు అరుదైన గౌరవం…2026 ‘టైమ్’ మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ వ్యక్తుల జాబితాలో చోటు!