
Pat Cummins: సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రెండో విజయం నమోదు చేసుకున్న ఆరెంజ్ ఆర్మీ ఈ నెల 18న ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌కు ముందు జట్టులో పలు మార్పులు చేసింది. జట్టులో కీలక ఆటగాడు గాయం కారణంగా దూరమయ్యాడు. ఆ స్థానంలో మరో బౌలర్ ఎంట్రీ ఇచ్చాడు. కాగా, ఇషాన్ కిషన్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకునే ఛాన్స్ ఉంది.
సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా కొనసాగుతున్న ఇషాన్ కిషన్ ఆ బాధ్యతల నుంచి తప్పుకొనే టైం వచ్చింది. ఇదే సమయంలో జట్టులోనూ మార్పులు జరిగే ఛాన్స్ ఉంది. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్స్ గాయంతో ఈ సీజన్ మొత్తానికే దూరం కాగా, అతడి స్థానంలో యాజమాన్యం శ్రీలంక యువ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దిల్సాన్ మధుశంకను రూ. 75 లక్షలకు తుది జట్టులోకి తీసుకుంది. మధుశంక స్వింగ్ బౌలింగ్ తో బ్యాటర్లను ముప్ప తిప్పులు పెట్టగలడు. కాగా, ఫిట్‌నెస్ సమస్యలతో ఫస్ట్ హాఫ్ మ్యాచ్‌లకు దూరమైన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా తిరిగి జట్టులోకి వస్తున్నట్లు తెలుస్తుంది.
►ALSO READ | పంజాబ్తో ముంబై ఉత్కంఠ పోరు.. రోహిత్ శర్మ ఆడేది డౌటే!
ఆస్ట్రేలియాలో ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తి చేసుకుని, ఈ నెల 25వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు అతడు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అన్ని జట్లకి మింగుడు పడని రాజస్థాన్ రాయల్స్ ను ఓడించిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు తిరిగి కమిన్స్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. సన్ రైజర్స్ తదుపరి మ్యాచ్ సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ ను ఢీ కొట్టనుంది. వెన్నుగాయం కారణంగా కొన్ని రోజుల నుంచి కమిన్స్ ఆటకు దూరంగా ఉంటున్నాడు. సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన 9 మ్యాచుల్లో కనీసం 7 మ్యాచులలో నెగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక కమిన్స్ కెప్టెన్ గా తిరిగి రావటం జట్టుకు అదనపు బలంగా మారబోతుంది.