Reading Time: < 1 minute

Rohit Sharma: ఏకంగా స్టేడింయలోనే డ్యాన్స్ చేసిన రోహిత్ శర్మ.. నెట్టింట వీడియో వైరల్

Caption of Image.

Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా వాంఖడే స్టేడియంలో ఈరోజు పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరగనున్న కీలక మ్యాచ్ కి రంగం సిద్ధమైంది. ఇక మ్యాచుకి ముందు రోహిత్ శర్మకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాంఖడే స్టేడియంలో బుధవారం జరిగిన ఫిట్‌నెస్ డ్రిల్ సమయంలో రోహిత్ సరదాగా డ్యాన్స్ చేస్తూ కనిపించడం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

రోహిత్ గాయంపై ఉత్కంఠ: 
గత ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఇక మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు కూడా అతను దూరంగా ఉండటంతో, పంజాబ్‌తో జరిగే కీలక మ్యాచ్‌లో రోహిత్ ఆడతాడా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ తాజాగా వైరల్ అయిన వీడియోలో రోహిత్ శర్మ తన మోకాళ్లను ఛాతీ వరకు ఎత్తుతూ చేసే వ్యాయామం (Fitness Drill) చేస్తూ, మధ్యలో ఫన్నీగా డ్యాన్స్ చేయడం కనిపించింది. ఇది చూసి అభిమానులు మురిసిపోతున్నప్పటికీ, మరో అంశం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఇక డ్యాన్స్ చేస్తున్న ఆ వీడియోలో రోహిత్ తన తొడ భాగంలో బ్యాండేజ్ చుట్టుకుని ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. 

►ALSO READ | SRH కెప్టెన్గా ఇషాన్ కిషన్ ఔట్.. ఆ మ్యాచ్కి కెప్టెన్ సాబ్ ఎంట్రీ

పంజాబ్ మ్యాచ్‌లో ఆడతాడా?: 
రోహిత్ శర్మ ప్రాక్టీస్‌లో హుషారుగా కనిపించినప్పటికీ, గాయం ఇంకా పూర్తిగా తగ్గలేదని ఆ బ్యాండేజ్ సూచిస్తోంది. ఒకవేళ ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ రిస్క్ తీసుకోవద్దని భావిస్తే, రోహిత్ స్థానంలో డానిష్ మలేవార్ లేదా రాబిన్ మింజ్ ఓపెనర్లుగా వచ్చే అవకాశం ఉంది. టాస్ పడే వరకు హిట్ మ్యాన్ తుది జట్టులో ఉంటాడో లేదో వేచి చూడాల్సిందే. 

©️ VIL Media Pvt Ltd.