
తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వివాదాస్పద కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ను పాకిస్తాన్ తో పోల్చారు. బ్రిటీష్ వారి కంటే చెత్తగా ఏపీని విభజించారని ఆరోపించారు. భారత్ నుంచి పాకిస్తాన్ ను విడదీసినట్లుగా ఏపీని విభజించారని తెలంగాణపై అక్కసు వెళ్లగక్కారు.గతంలో కూడా బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదటి నుంచి ఇష్టం లేని బీజేపీ నేతలు తరుచు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తెలంగా తెలంగాణ ఎంపీలు,ఉద్యమకారులు మండిపడ్డారు.
►ALSO READ | మహిళా రిజర్వేషన్ బిల్లుతో దేశం దశాదిశా మారబోతోంది : ప్రధాని మోదీ
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య కామెంట్లపై తెలంగాణ కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తేజస్వీ సూర్య తన వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజాలను తీవ్రంగా అవమానించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ తో పోల్చుతారా..అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు పొన్నం. ఎంతో మంది బలిదానాలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.. తెలంగాణ ఆకాంక్షలను బీజేపీ అవమానిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం మొదటినుంచి బీజేపీకి ఇష్టం లేదని పొన్నం విమర్శించారు.