Reading Time: < 1 minute
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధర..ఇవాళ తులం ఎంతంటే

గోల్డ్‌ ప్రియులకు గుడ్ న్యూస్. పశ్చిమాసియా దేశాల్లో వార్ పసిడి ప్రియులకు కలిసి వస్తోంది. ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ తో కలిసి చేసిన దాడితో డాలర్ పుంజుకుంది. ట్రంప్ వార్నింగ్ కూడా తోడవడంతో మార్కెట్లో డాలర్ ఆధారిత ఆస్తుల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. దీంతో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. మార్చి 4 బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.3,110 తగ్గి, రూ.1,64,510 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.2,850 తగ్గి, రూ.1,50,800 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.2,85,000 లు పలుకుతోంది. మార్చి 4, బుధవారం వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే.. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,64,660 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,50,950 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,64,510 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,50,800 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,65,820 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,52,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,64,510 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,800 లు పలుకుతోంది. వెండి ధర కిలోకి రూ.2,85,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌చేసుకొని వెళ్తే మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ ఊరిలో బారసాల చేయాలంటే.. హోలీ రావాల్సిందే.. కారణం

భక్తి పారవశ్యం లో జనం.. శూలాల నైవేద్యం..

Kurnool: నిప్పుల కొలిమిలా కర్నూలు.. దేశంలోనే హాట్ సిటీ

Thalapathy Vijay: పాపం విజయ్‌… కొడుకు కూడా ఛీపో అన్నాడు!

Renu Desai: నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఎవరిచ్చారు ??