Reading Time: < 1 minute

Good Health: పళ్లు దగదగ మెరుస్తూ.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే

Caption of Image.

పళ్లు తెల్లగా ఉండాలని కోరుకోని వాళ్లుండరు. ఇందుకు ఖరీదైన చికిత్స అందరికీ సాధ్యం కాదు కాబట్టి… పళ్లను హెల్దీగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు మీ కోసం...

 మీ పళ్లు తెల్లగా మెరవడానికి అరటి తొక్కలు బాగా ఉపయోగపడతాయి. రోజూ ఉదయం, సాయంత్రం ఒక నిమిషం పాటు అరటితొక్కను పళ్లపై రుద్దండి. దానిలో ఉండే పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం మినరల్స్ పళ్లకు అంది తెల్లగా మెరుస్తాయి. నారింజ తొక్కలతోనూ ప్రయత్నించవచ్చు.

స్ట్రాబెరీ గుజ్జు.. స్ట్రాబెరీలో పళ్లను మెరిపించే అనేక మినరల్స్ ఉన్నాయి. స్ట్రాబెరీని గుజ్జుగా చేసి.. దాన్ని పళ్లకు పట్టించి మూడు నిమిషాల పాటు ఉంచాలి. దీనిలో ఉండే మాలిక్ యాసిడ్ పళ్లను తెల్లగా మార్చడంలో తోడ్పడుతుంది. ఇక స్ట్రాబెరీలో ఉండే ఫైబర్ పళ్ల మధ్య ఉండే బ్యాక్టీరియాను చంపి నోటిని శుభ్రం చేస్తుంది.

కరకరమనే క్యారెట్లను శుభ్రంగా కడుక్కొని సమలండి చాలు. ఇది సహజమైన క్లీనర్​ గా పని చేసి పళ్లకు పట్టిన పాచిని వదిలిస్తుంది. ఇది బ్యాక్టీరియాను చంపడమే కాకుండా.. దీనిలో ఉండే ఆరోగ్యవంతమైన జిగురు పళ్లు తెల్లగా మారేలాచేస్తుంది. అంతేకాదు పంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను కూడా క్యారెట్ చంపుతుంది.

 పొగతాగడం మానాలి. పొగతాగడం వల్ల పళ్లు పసుపు రంగులోకి మారుతాయి. పలు రకాల వ్యాధులకు ఈ పొగ స్థావరం కూడా ఏర్పాటు చేస్తుంది. మీ పళ్లు మెరుస్తూ, ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా పొగతాగడం మానేయాల్సిందే.

-–వెలుగు, లైఫ్​–

©️ VIL Media Pvt Ltd.