Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్: బాలల అశ్లీల కంటెట్ షేర్ చేస్తున్న వారి భరతం పట్టేందుకు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో శుక్రవారం భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఈ సందర్భం గా 24 మందిని అరెస్ట్ చేసినట్లు రాష్ట్ర టిజిసిఎస్‌బి(సైబర్ సెక్యూరిటీ బ్యూరో) ప్రకటనల విడుదల చేసింది. హైదరాబాద్‌తో సహా రాష్ట్ర వ్యాప్తంగా 18 బృందాలు ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు టిజిసిఎస్‌బి డైరెక్టర్ శిఖాగోయొల్ వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో విస్తుపోయే విషయాలు గుర్తించామని తెలిపారు. నిందితుల్లో పలువురు చిన్నారుల అశ్లీల కం టెంట్ చూడటంతో పాటు వాటిని వ్యాప్తి చే యడం, సైబర్ నేరగాళ్లకు నగదు మళ్లించేందుకు మ్యూల్ ఖాతాలతో సహకరిస్తున్న వారి ని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితుల్లో 24 మంది బాలల నేరాలకు సంబంధించిన వారు కాగా, పది మంది మ్యూల్ ఖాతాలతో సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న వారున్నారని తెలిపారు. అలాగే ఈ నేరాలకు పాల్పడిన వారిలో 18నుండి 45సంవత్సరాల వయస్సు కలిన వారు ఉన్నారని పేర్కొన్నారు. వారు పిల్లల లైంగిక వేధింపుల మెటీరియల్‌కు అలవాటు పడ్డట్లు గుర్తించామన్నారు. అరెస్ట్ చేసిన వారి లో నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తితో పాటు, నీటిపారుదశాఖకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లు తెలిపారు. బాధితుల్లో తరువాయి 9లో