Reading Time: < 1 minute

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రూ.20 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వస్తున్న ప్రయాణికుడి నుంచి హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేసి ఈగల్ టీమ్ కు సమాచారం ఇచ్చారు. బ్యాంకాక్ నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ఓ ప్రయాణికుడి వద్ద చెక్ చేయగా భారీ మొత్తంలో గంజాయి బయటపడింది. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఎవరెవరికి సరఫరా చేస్తున్నారని అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.