Reading Time: 2 minutes
Gas Cylinder: 5 కేజీల సిలిండర్ వచ్చేసింది.. బుకింగ్ అవసరం లేదు.. ఎక్కడైనా, ఎప్పుడైనా రీఫిల్..

గ్యాస్ కోసం ఏజెన్సీల వద్ద గంటల కొద్ది వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇక గ్యాస్ బుకింగ్ చేసుకున్నా కూడా డెలివరీ ఇంకా ఇంటికి రాలేదని ఆందోళన పడాల్సిన పని ఉండదు. నేరుగా గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి నిమిషాల్లోనే గ్యాస్ సిలిండర్ తీసుకోవచ్చు. గ్యాస్ ముందుగానే బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. గ్యాస్ లేక వంటిట్లో గృహిణులు బాధ పడకూడదనే ఉద్దేశంతో ప్రముఖ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.

5 కేజీల సిలిండర్ వచ్చేసింది

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంటిట్లో గ్యాస్ కష్టాలను తీర్చేందుకు ఊరట కలిగించింది. 5 కేజీల చిన్న సిలిండర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. తక్షణమే ఈ సిలిండర్ అందుబాటులో ఉంటుందని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్‌లో తెలిపింది. ఈ సిలిండర్‌ను నేరుగా సమీపంలోని ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి తీసుకోవచ్చు. ఇందుకు ముందుగా ఎలాంటి బుకింగ్ అవసరం లేదని, గ్యాస్ ఏజెన్సీ వద్ద ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం కూడా ఉందని తెలిపింది. గ్యాస్ కొరత క్రమంలో కేంద్రం త్వరలో 10 కేజీల సిలిండర్ తీసుకురానుందనే వార్తలు ఇటీవల వినిపించాయి. అయితే ఆ వార్తలను కేంద్రం కొట్టివేసింది. 14.2 కిలోల సిలిండర్‌లో 10 కేజీల గ్యాస్ మాత్రమే నింపుతారనే వార్తలు వచ్చాయి. కానీ కేంద్రం ఆ పుకార్లకు చెక్ పెట్టింది. అయితే  ఈ సిలిండర్ రాకతో ఎల్పీజీ సిలిండర్ ఇంటికి ఎప్పుడు డెలివరీ అవుతుందా అని వేచి ఉండాల్సిన అవసరం లేదు. గ్యాస్ లేకపోతే వంటిల్లో పని ఆగిపోతుందనే భయం కూడా ఉండదు. గ్యాస్ కొరత క్రమంలో ఈ చిన్న సిలిండర్ తీసుకురావడం హాట్ టాపిక్‌గా మారింది.

ప్రత్యేకత ఏంటంటే..?

ఈ చోటు సిలిండర్ ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ కేటగిరి కిందకు వస్తుంది. ఈ సిలిండర్ కొనుగోలు చేసేందుకకు జస్ట్ గుర్తింపు రుజువును అందిస్తే సరిపోతుంది. అడ్రస్ ప్రూప్ కూడా అవసరం లేదు. అలాగే ఇంట్లో ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్‌కు వర్తించే నిబంధనలు దీనికి వర్తించవు. ఇక ఈ సిలిండర్ రీఫిల్ కోసం ఒకే పంపిణీదారుడి వద్దకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. అంటే మీరు రీఫిల్ ఎక్కడైనా చేసుకోవచ్చు. కిరాణా దుకాణాల్ల, ఇండేన్ డిస్ట్రిబ్యూటర్లు, ఆధీకృత అవుట్ లెట్లలో ఎప్పుడైనా రీఫిల్ చేసుకోవచ్చు. ప్రజలు ఎల్పీజీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ చోటు సిలిండర్ తీసుకోచ్చినట్లు కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి.