
హైదరాబాద్: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన హైదరాబాద్‌లోని ఇల్లును జిహెచ్ఎంసి అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఈ భవనంపై ఆస్తి పన్ను బకాయిలు ఉండటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సుమారు రూ.1.60 కోట్ల మేర ఆస్తి పన్ను బకాయి ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ విషయంపై పలుమార్లు జయలలిత కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో చివరికి భవనాన్ని సీజ్ చేసినట్లు వివరించారు. గతంలో ఈ భవనాన్ని వ్యాపారవేత్త విజయ్ మాల్యా లీజ్‌కు తీసుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి ఆస్తి పన్ను బకాయి ఉన్నట్టు తెలిసింది.