Reading Time: < 1 minute
Bihar Nalanda Sheetala Mata Temple Stampede Deaths Injuries

Stampede: బీహార్‌లోని నలంద జిల్లాలో గల శీతలా మాత ఆలయం (Sheetala Mata Mandir) వద్ద మంగళవారం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాట ఘటనలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. పదుల సంఖ్యలో గాయాలయినట్లు సమాచారం. మంగళవారం ప్రత్యేక పూజల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలిరావడంతో ఈ ఘటన జరిగింది. విషాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే, పోలీసు అధికారులు స్థానిక గ్రామస్థులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఇక భక్తుల ఆర్తనాదాలతో ఆలయం పురవీధులు దద్దరిల్లాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆసుపత్రుల్లో క్షతగాత్రుల హాహాకారాలు హోరెత్తించాయి.

READ MORE: AA25 : ధురంధర్ హీరో కథతో ఐకాన్ స్టార్?