
నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన వీరసింహా రెడ్డి సినిమాతో తెలుగు తెరపై తళుక్కున మెరిసింది మలయాళ బ్యూటీ హనీ రోజ్ (Honey Rose). తన అందం, అభినయంతో మంచి గుర్తింపు సంపాదించింది. ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్‌లో కూడా ఆమెకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది.
ఇటీవల హనీ రోజ్‌కు కేరళలో జరిగిన ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చేదు అనుభవం ఎదురైంది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆమెను చూడటానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ప్రారంభంలో పరిస్థితి నియంత్రణలోనే ఉన్నప్పటికీ, ఆమె మాల్‌లోకి ప్రవేశించే సమయంలో అభిమానులు ఒక్కసారిగా సెల్ఫీల కోసం ముందుకు దూసుకువచ్చారు.
ఈ క్రమంలో కొందరు వ్యక్తులు హద్దులు దాటి అనుచితంగా ప్రవర్తించినట్లు సమాచారం. సెల్ఫీ తీసుకునే నెపంతో ఆమెకు అత్యంత దగ్గరగా రావడం ద్వారా వ్యక్తిగత పరిమితులను ఉల్లంఘించారు. ముఖ్యంగా ఆ సమయంలో ఒక వ్యక్తి సెల్ఫీ కోసం ఆమె నడుముపై చేయి వేయడం కలకలం రేపింది. ఈ అనూహ్య పరిణామంతో హనీ రోజ్ అసౌకర్యానికి గురై, వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు.
►ALSO READ | వెంకట్ హీరోగా ‘హరుడు’.. మేలో రిలీజ్
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ విస్తృత చర్చకు దారి తీస్తున్నాయి. నెటిజన్లు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ, సెలబ్రిటీల పట్ల గౌరవం పాటించాల్సిన అవసరం ఉందని, అభిమానం పేరుతో హద్దులు దాటకూడదని సూచిస్తున్నారు. అలాగే ఇలాంటి కార్యక్రమాల్లో నిర్వాహకులు సైతం మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
crowd touching her 🤯
Ela ra ala 😐
Event organizers em chesthunaruHoney rose pic.twitter.com/SIi3CE5LT3
— 000009 (@ui000009) March 29, 2026