Reading Time: < 1 minute
Ravindra Jadeja Kisses Csk Logo Emotional Moment Goes Viral In Ipl 2026

Ravindra Jadeja Kisses CSK Logo: ఐపీఎల్ 2026లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌ లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో ఓ ఆసక్తికరమైన, భావోద్వేగపూరితమైన దృశ్యం అభిమానుల మనసు గెలుచుకుంది. మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును రాజస్థాన్ రాయల్స్ జట్టు చెన్నై 8 వికెట్ల భారీ తేడాతో భారీ విజయం సాధించింది.

Raghav Chadha: గ్రాముల్లో ఛార్జీలు వసూలు చేసేవారు.. గంటల ఆలస్యానికి పరిహారం ఇవ్వరా..? విమాన సంస్థల తీరుపై ఫైర్..!

ఇక మ్యాచ్ విషయం పక్కన పెడితే.. మ్యాచ్ ముగిసిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాజీ స్టార్ ఆల్రౌండర్, ప్రస్తుత రాజస్థాన్ రాయల్స్ ఆటగాడైన రవీంద్ర జడేజా ప్రత్యర్థి జట్టు ప్లేయర్ ఖలీల్ అహ్మద్‌తో మాట్లాడుతున్న సమయంలో చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. జడేజా తన పాత జట్టు సీఎస్కే (CSK)పై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు.

మ్యాచ్ ముగిసిన తర్వాత రవీంద్ర జడేజా ప్రత్యర్థి జట్టు బౌలర్ ఖలీల్ అహ్మద్ మైదానంలో సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఆ సమయంలో ఖలీల్ అహ్మద్ జెర్సీపై ఉన్న సీఎస్కే లోగోను చూసిన జడేజా ఆ లోగోను ముద్దాడాడు. ఈ అద్భుతమైన క్షణాన్ని కెమెరాలు బంధించగా.. నెటిజన్లు దీనిని “బెస్ట్ మూమెంట్ ఆఫ్ ది మ్యాచ్”గా అభివర్ణిస్తున్నారు.

Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

ఇక చెన్నై జట్టుతో జడేజాకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత ఏడాది కాలంగా కొన్ని మార్పులు జరిగినప్పటికీ, జడేజా మనసులో చెన్నై సూపర్ కింగ్స్ పట్ల ఉన్న గౌరవం, ప్రేమ ఏమాత్రం తగ్గలేదని ఈ ఘటన నిరూపించింది. ముఖ్యంగా 2024 ఐపీఎల్ ఫైనల్ చెన్నై గెలిచింది అంటే దానికి ఏకైక కారణం జడేజానే. జడ్డూ ఇప్పటికీ సీఎస్కేను ప్రేమిస్తున్నాడు, ఆ జట్టు లోగోను ముద్దాడటం చూస్తుంటే ముచ్చటేస్తోంది అంటూ చెన్నై అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే కొందరు మాత్రం ఈ ఫోటోలు AI జనరేటెడ్ అంటూ కొట్టిపారేస్తున్నారు.