
ఆకాశంలో మరో అద్భుత దృశ్యం ఏప్రిల్ 1ఆవిష్కృతం కానుంది. ఎప్పుడూ దగ దగ మెరుస్తూ తెల్లగా కనిపించే చంద్రుడు.. ఆరోజు కొత్త రంగును సంతరించుకోనున్నాడు. చంద్రుడిని సాధారణంగా ఎరుపు, పసుపు, నలుపు చూసి ఉంటాం. ఆ రోజు రాత్రి చంద్రుడు పింక్ కలర్లో కనపడటానికి కారణాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గ్రంథాలలో పూర్ణిమ తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆ రోజున భూమిపై చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వసంత రుతువులో అంటే చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి రోజున చంద్రుడు గులాబీ రంగులో కనిపిస్తాడు. అందుకే పింక్ మూన్ అంటారు. వాస్తవానికి చంద్రుడు గులాబీ రంగులో ఉండదు,ఇది ఓ రకమైన పింక్ కలర్ వైల్డ్ ఫ్లవర్.వసంతరుతువు పౌర్ణమి వివరాలు..
వసంత రుతువు.. చైత్రమాసం పౌర్ణమి తిథి ప్రారంభం : ఏప్రిల్1 ఉదయం 7.06 గంటలకు
వసంత రుతువు.. చైత్రమాసం పౌర్ణమి తిథి ముగింపు : ఏప్రిల్ 2 ఉదయం 7.41 గంటలకు
ఏప్రిల్ 1న రాత్రి సమయంలో తూర్పు వైపు చూస్తే.. గులాబీ రంగులో ఉన్న చంద్రుడు కనపడతాడు. భూమి ఉపరితలం నుండి ప్రతిబింబించే కాంతి చెదరడం వల్ల చంద్రాస్తమయం సమయంలో దగ్గరగా ఉన్నప్పుడు భూమి ఉపరితలం పింక్ రంగులో ఉండే అవకాశం ఉంది.
ఏప్రిల్ 1 వ తేదనీ పౌర్ణమి రోజు పింక్ మూన్ వెనుక ఆధ్యాత్మిక వివరాలను పరిశీలిస్తే ఆరోజుచంద్రుడు బుధగ్రహానికి చెందిన కన్యారాశిలో సంచరిస్తాడు. తెలుగు సంవత్సరంలో వచ్చే తొలి పౌర్ణమిని పింక్ మూన్ గా పిలుస్తారు. వసంతకాలంలో వికసించే పువ్వు అని అర్థం వచ్చేలా … పింక్ మూన్ అనే పేరు పెట్టారు. దీన్ని మైక్రో మూన్ అని కూడా పిలుస్తారు.
జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం చైత్రమాసం వసంతరుతువులో ఏర్పడే పింక్ మూన్ జీవితంలో ఒక కొత్త ఆరంభాన్ని తీసుకువస్తుందని చెబుతున్నారు. వసంత రుతువుతో పాటు.. ప్రజల జీవితాల్లో వచ్చే కొత్త మార్పులను.. అవకాశాలను స్వాగతిస్తూ… కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి, కొత్త ప్రణాళికలు వేసుకోవడానికి… కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి ఇది సరైన సమయమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
వసంత రుతువు పౌర్ణమి రోజున చంద్రుడు భూమికి కొంచెం దూరంగా ఉంటాడు . కాబట్టి కొద్దిగా చిన్నగా కనిపిస్తాడు. ఈ నేపథ్యంలో ఒక్కో దేశంలో అవి ఉన్న అక్షాంశ, రేఖాంశ స్థానాల దృష్ట్యా చంద్రుడు విభిన్నంగా కనిపిస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు