Reading Time: < 1 minute

30 నెలల్లో హ్యామ్ రోడ్లు పూర్తి : మంత్రి వెంకట్ రెడ్డి

Caption of Image.
  • భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎలివేటెడ్‌‌ కారిడార్ల నిర్మాణం: మంత్రి వెంకట్ రెడ్డి

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్​(హ్యామ్) పద్ధతి అమలు చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌ రెడ్డి తెలిపారు. ఈ విధానం కింద ప్రభుత్వం 12 వేల కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఫేజ్-1లో 6,092 కిలోమీటర్ల రోడ్లను రూ.13,006 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. 

30 నెలల్లో పనులు పూర్తి చేస్తామని, 15 ఏండ్ల పాటు రోడ్ల నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్లదేనని చెప్పారు. సోమవారం శాసనసభలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో భవిష్యత్ అవసరాల కోసం డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్లు, హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. బుల్లెట్ ట్రైన్స్ కోసం సెంటర్ పాయింట్‌‌గా భారత్ ఫ్యూచర్ సిటీలో శంషాబాద్ దగ్గరలో 500 ఎకరాలు ప్రభుత్వం కేటాయించనున్నట్లు వివరించారు.

©️ VIL Media Pvt Ltd.