
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) ఫస్టియర్ ఎగ్జామ్ షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం రిలీజ్ చేసింది. ఏప్రిల్15 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించవచ్చని ఆ విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు.
రూ.50 ఫైన్‌తో ఏప్రిల్ 23 వరకు చాన్స్ ఉందని తెలిపారు. 2025–-27 బ్యాచ్ విద్యార్థులతోపాటు పాత బ్యాచ్‌ల్లో ఫెయిలైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం bse.telangana.gov.inలో సంప్రదించాలని సూచించారు.