Reading Time: 2 minutes
West Bengal Opinion Poll 2026 Tmc Vs Bjp Seat Prediction Mamata Leads

దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సమరం నడుస్తోంది. పశ్చిమ బెంగాల్‌ సహా తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లో మినీ ఎన్నికల సమరం నడుస్తోంది. మండు వేసవిలో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రధాన పార్టీల మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ సాగుతోంది. అయితే మిగతా రాష్ట్రాలన్నీ ఒకెత్తు అయితే బెంగాల్ మాత్రం మరోకెత్తు. ఎలాగైనా ఈసారి అధికారి ఛేజిక్కించుకోవాలని కమలనాథులు తహతహలాడుతున్నారు. ఈ నేపథ్యంలో చేపట్టిన సర్వే తాజాగా వెలుగులోకి వచ్చింది.

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఒపీనియన్ పోల్స్ సర్వే వెలుగులోకి వచ్చింది. వోట్‌వైబ్ సర్వే సంస్థ ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. ఈ సర్వేను ఓ జాతీయ మీడియా వెలుగులోకి తెచ్చింది. 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 174-184 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మెజారిటీ మార్క్ 148 ఈజీగా క్రాస్ చేస్తుందని తెలిపింది. ముచ్చటగా నాలుగో సారి మమతా బెనర్జీ అధికారాన్ని కైవసం చేసుకోబోతుందని స్పష్టం చేసింది. ఇక బీజేపీ 108-118 సీట్లు కైవసం చేసుకోవచ్చని పేర్కొంది. 46.4 శాతం మద్దతుతో మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ముందంజలో ఉన్నారు. ఉద్యోగాలు, అభివృద్ధి మాత్రమే ఓటర్ల ప్రధాన ఆందోళనలుగా వ్యక్తమయ్యాయి.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో బీజేపీ అవకాశాలకు అభిప్రాయ సేకరణ భారీ ఊతమిచ్చింది. ఈ పార్టీ 108-118 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇక కాంగ్రెస్, సీపీఎం వంటి మిగిలిన పార్టీలు మరోసారి రెండు ప్రధాన పార్టీలకు సవాలు విసరడంలో విఫలమయ్యాయని.. కేవలం 0-4 సీట్లతో సరిపెట్టుకుంటాయని అభిప్రాయ సేకరణ అంచనా వేసింది.

మార్చి 23న వోట్‌వైబ్ విడుదల చేసిన అభిప్రాయ సేకరణలో టీఎంసీకి 184-194 సీట్లు, బీజేపీకి 98-108 సీట్లు వస్తాయని అంచనా వేసింది. తాజా సర్వే మాత్రం బీజేపీ సీట్ల సంఖ్యను పెంచుతూ టీఎంసీ అంచనా సంఖ్యలను తగ్గించింది.

2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో రాష్ట్రంలో 215 స్థానాలను గెలుచుకుని టీఎంసీ అధికారాన్ని నిలబెట్టుకోగా.. బీజేపీ 77 స్థానాలను గెలుచుకుంది. మమత అవకాశాలను దెబ్బతీయడంలో బీజేపీ విఫలమైనప్పటికీ.. అంతకుముందు రాష్ట్రంలో నామమాత్రంగా ఉన్న బీజేపీకి ఈ ఎన్నికలు ఒక కీలక మలుపుగా నిలిచాయి. ఇక తాజా అంచనాలు నిజమైతే మాత్రం పశ్చిమ బెంగాల్‌లో మరోసారి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడనుంది. బీజేపీ బలమైన, శక్తివంతమైన ప్రతిపక్షంగా ఉండనుంది.

ముఖ్యమంత్రి ఎవరు?
పశ్చిమ బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రి పదవికి మమతా బెనర్జీ (టీఎంసీ) 46.4 శాతం ఓట్లతో అగ్రస్థానంలో ఉండగా.. సువేందు అధికారి (బీజేపీ) 34.9 శాతం ఓట్లతో ఆమె తర్వాతి స్థానంలో ఉన్నారని సర్వేలో వెల్లడైంది. అధిర్ రంజన్ చౌదరి (ఐఎన్‌సీ), మహమ్మద్ సలీం (సీపీఎం) వరుసగా 3.2 శాతం- 5.0 శాతం ఓట్లతో వెనుకబడి ఉండగా.. ఇతరులు/చెప్పలేము అనే వర్గం 5.5 శాతం ఓట్లు వచ్చాయి.

మత, కుల విభజనలు..
మత, కుల విభజనలు ఓటింగ్‌ను ప్రభావితం చేయనున్నాయి. ముస్లింలు టీఎంసీకి గట్టిగా మద్దతు ఇస్తున్నాయి (60.9 శాతం), ఎస్సీ/ఎస్టీలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు (చెరో 50 శాతం). అగ్రవర్ణ హిందువులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు (46.8 శాతం వర్సెస్ టీఎంసీ 35.4 శాతం). మంది మద్దతు ఇస్తున్నారు.

ఇది కూడా చదవండి: US-Iran War: ఇరాన్‌పై అమెరికా బంకర్ బస్టర్ బాంబు దాడి.. పెద్ద ఎత్తున ఎగిసిపడ్డ మంటలు