
అమరావతి: ఆటో, ట్రాక్టర్ డ్రైవర్ కలిసి 14 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం చేశారు. సదరు బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కర్నూలు జిల్లాలో ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. బాలిక తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను ఆటో డ్రైవర్ బోయ మహేంద్ర ప్రతి రోజు తన ఆటోలో స్కూల్‌కు తీసుకెళ్లేవాడు. ఆమెకు మాయమాటలు చెప్పి బాలికను మహేంద్ర లొబరుచుకున్నాడు. అనంతరం అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ తెలుగు శివ కుమార్ కూడా మహేంద్ర ఈ విషయం చెప్పడంతో అతడు కూడా బాలికను బెదిరించి అత్యాచారం చేశారు. ఇద్దరు పలుమార్లు బాలికను బెదిరించి అత్యాచారం చేశారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించారు. బాలిక ఒంట్లో నలతగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. బాలిక తల్లిదండ్రులను నిందితుల కుటుంబ సభ్యులు బెదిరించే అవకాశం ఉండడంతో నవజాత శిశువు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సంరక్షణలో వారిని ఉంచారు.