Reading Time: < 1 minute

న్యూఢిల్లీ : గుజరాత్‌లో ఈనెల 10 నుంచి 12 వరకు మూడు రోజుల పాటు ప్రధాని మోడీ పర్యటిస్తారు. ఈ సందర్భంగా సోమనాథ్ ఆలయం వద్ద జరుగుతున్న సోమనాథ్ స్వాభిమాన్ పర్వదినం వేడుకల్లోను, రాజ్‌కోట్‌లోని కచ్, సౌరాష్ట్ర రీజియన్‌లోవైబ్రంట్ గుజరాత్ రీజినల్ కాన్ఫరెన్సులోను పాల్గొంటారు. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిచ్ మెర్జ్‌ను అహ్మదాబాద్‌లో కలుసుకుంటారు. జనవరి 10న రాత్రి 8 గంటలకు ఓంకార మంత్రజపంలో పాల్గొంటారు. 11 ఉదయం 9.45 కు శార్యయాత్రలో పాల్గొంటారు. ఉదయం 10.15 గంటలకు సోమనాథ్ ఆలయంలో ప్రార్థనలు చేస్తారు. ఉదయం 11 గంటలకు సోమనాథ్ స్వాభిమాన్ పర్వదిన వేడుకల్లో పాల్గొంటారు.

ఈనెల 11న రాజ్‌కోట్‌లో గుజరాత్ రీజినల్ కాన్ఫరెన్స్‌లో వాణిజ్య ప్రదర్శన ప్రారంభిస్తారు. అదేరోజు సాయంత్రం 5.15కు అహ్మదాబాద్ మెట్రో రెండో దశ లైన్‌ను ప్రారంభిస్తారు. 12న జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిచ్ మెర్జ్‌ను కలుసుకున్న తరువాత వారిద్దరూ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. సబర్మతి నదీతీరంలో అంతర్జాతీయ పతంగి ఉత్సవంలో పాల్గొంటారు. గాంధీనగర్ లోని మహాత్మా మందిర్‌లో ఉభయ నేతలు ఉదయం 11.15 గంటల నుంచి ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షిస్తారు.