
డెయిర్ అల్ బలా : గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య అధికారులు వెల్లడించారు. ఉత్తర గాజాలో జరిగిన ఈ దాడుల్లో మృతులైన వారిలో ఒక పసికందు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే ఇజ్రాయెల్ ఆర్మీ శుక్రవారం తాము హమాస్ సౌకర్యాలను విచ్ఛిన్నం చేశామని వెల్లడించింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన దశల వారీ కాల్పుల విరమణ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. గాజాలో చివరిబందీ అవశేషాలను పొందడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.