Reading Time: < 1 minute

న్యూఢిల్లీ : దేశంలోని నగరాల్లో 44 శాతం దీర్ఘకాలిక వాయు కాలుష్యంతో అల్లాడుతున్నాయని, కేవలం 4 శాతం నగరాలే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్‌సిఎపి) పరిధిలో ఉంటున్నాయని, సెంటర్ ఫర్ రీసెర్చి ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సిఆర్‌ఇఎ) నివేదిక వెల్లడించింది. శాటిలైట్ డేటా ప్రకారం సిఆర్‌ఇఎ వాయు కాలుష్యాన్ని విశ్లేషించ గలిగింది. మొత్తం 4041 భారత నగరాల్లో పిఎం 2.5 కాలుష్య స్థాయిలను సమీక్షించింది.

ఈ మొత్తం నగరాల్లో 1787 నగరాలు జాతీయ వార్షిక సరాసరి పిఎం2.5 ప్రమాణాలను గత ఐదేళ్లుగా ( 201924 ) కొవిడ్ సంవత్సరం 2020 మినహాయించి ఏటా అధిగమిస్తున్నాయని పేర్కొంది. అంటే దీని అర్థం 44 శాతం నగరాలు దీర్ఘకాలిక వాయుకాలుష్‌యంతో సతమతమవుతున్నాయని తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి వాయు కాలుష్యం వంటి సమస్యలకు అప్పుడప్పుడు జరిగే సంఘటనలు (స్వల్పకాలిక ఎపిసోడ్‌లు) కారణం కావని, నిరంతరం జరిగే కార్యకలాపాల ( నిరంతర ఉద్గార వనరుల ) వల్లనే ఈ సమస్యలు వస్తాయని స్పష్టమైంది.